ఏన్కూరు, మనమే సాక్ష్యం: తోటి మనిషి ఇబ్బంది పడుతున్న మనకెందుకులే అనే రోజులు ఇవి కానీ ఒక మూగ జీవి కుక్కపిల్లకు వెనక కాళ్లు లేక నడవలేక ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేక ఒక మనసు చలించింది. ఎలాగైనా సరే ఈ కుక్కపిల్లను నడిపించాలనుకున్నది, తనకు వచ్చిన ఒక ఆలోచన అమలు చేసి ఒక బుల్లి చక్రాల బండితో కుక్క పిల్లల నడిపిస్తూ కుక్క పిల్లకు డాక్టర్ అయింది. ఈ సంఘటన ఏన్కూర్ మండలంలోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేస్తున్న ఉమాకు మూగజీవులంటే ప్రాణం, తన భర్త రమణ సహాయంతోని కుక్కల పై ఉన్న ప్రేమను తను పెంచుకునే కుక్కలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలను సైతం ఇంట్లో ఉన్న బిస్కెట్లు తినుబండారులను పెట్టి పెంచడం ఆనవాయితీగా వస్తుంది, గురుకుల పాఠశాల ఆవరణంలో ఒక చిన్న కుక్క పిల్లకు వెనక రెండు కాళ్లు లేక నడవలేక ఈడ్చుకుంటూ పోతున్న కుక్కను చూసి ఉమా మనసు చలించింది, వెంటనే ఒక బుజ్జి చక్రాలు బండి తెప్పించి వెనక రెండు కాళ్ళను చక్రాల బండి మీద పెట్టింది. దీంతో ఆ కుక్కపిల్ల చక్రాలు బండి సహాయంతో నడుస్తుంది. ఆ చక్రాలు బండి సహాయంతో ఉదయం సాయంత్రం కుక్కపిల్ల నడిపించటంతో గ్రామ ప్రజలు ఉమాను అభినందిస్తున్నారు.
